మెట్రో విస్తరణ, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ మెట్రోకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్ ఫోర్టు వరకు 32 కిలోమీటర్లు ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్టు కి వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తామన్నారు.
మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని తెలిపారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కు మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు రేవంత్ రెడ్డి.