త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబ్ పేల్చారు వేణు స్వామి. కొత్త పార్టీ పెడతాడని వేణు స్వామి చెప్పిన ఓ వీడియో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు.. తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత విడిపోతారు అని వేణు స్వామి కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. అయితే.. ఆ తర్వాత పెద్దగా బయట కనబడని వేణు స్వామి.. తాజాగా అల్లు అర్జున్ జాతకం చెప్పారు. త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అంటూ బాంబ్ పేల్చారు వేణు స్వామి. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎం లు అయ్యారు కాబట్టి… త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి.
త్వరలోనే @alluarjun సీఎం అవుతాడు..
కొత్త పార్టీ పెడతాడు – వేణు స్వామి pic.twitter.com/29067exZzw— HEMA NIDADHANA (@Hema_Journo) December 15, 2024