కట్టుకున్న భార్యను అడవిలో వదిలి‌వెళ్లిన భర్త.. ఎక్కడంటే?

-

భార్యను అడవిలో వదిలివెళ్లాడో కనికరం లేని భర్త. ఈ ఘటన ములుగు మండలం పరిధిలోని వంటిమామిడి గ్రామ శివారు‌లో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్‌ మన్వర్‌ ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూనే డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.హైదరాబాద్ వచ్చాక కూడా శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు మింగినట్లు సమాచారం. దీంతో విక్రమ్‌ తన భార్య రబియాను ములుగు మండలంలోని వంటిమామిడికి తీసుకొచ్చి అక్కడికి దగ్గరలోని అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం రబియాను ఆర్వీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం విచారించగా అసలు విషయం తెలిసిందే. అనంతరం యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారమిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version