దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ వస్తానన్నారు :వేణుగోపాల్

-

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ వెళ్లారు. ఈ మేరకు జూన్ 2వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది వేడుకలకు రావాలని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రోటోకాల్ బృందం కేసీఆర్‌ను ఆహ్వానించింది.

అనంతరం హర్కర వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ నందినగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం రాసిన లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని అందజేశాము. ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరామని, తప్పకుండా వస్తానని కేసీఆర్ చెప్పినట్లు వేణుగోపాల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version