నటుడు వేణుమాధవ్ విగ్రహావిష్కరణ.. ఎక్కడంటే ?

-

టాలీవుడు హాస్యనటుడు, దివంగత వేణుమాధవ్ విగ్రహాన్ని ఈ నెల 28న ఆవిష్కరించనున్నట్టి సమచారం. సూర్యాపేట జిల్లా కోదాడలో పుట్టిన ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టి, సినిమాలలో ఛాన్సులు రావడంతో ఎంటర్ అయ్యి టాప్ కమెడియన్స్ లో ఒకరిగా ఎదిగాడు. ఇక లివర్, కిడ్నీ సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయి వైద్యం అందుకుంటూ గతేడాది మృతిచెందారు.

ఇక ఆయన భార్య స్వస్థలం కరీనంగర్‌ జిల్లా జమ్మికుంట మండలం శాయంపేటలో వేణుమాధవ్ విగ్రహాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చెబుతున్నారు. మరి కొంత మంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. చివరిగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సినిమాల నుండి తప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version