వాతావరణంలో గతంలో కంటే చాలా మార్పులే వచ్చాయి. పెరుగుతున్న కాలుష్యం, భూతాపం పెరగడం. మనుషుల అలవాట్లలో మార్పులు రావడం వంటివి వాతావరణంలో మార్పులకు కారణమైంది. ఇది క్రమంగా మనకు ఎన్నో దూరం చేసే విధంగా వెళ్తుంది అనేది వాస్తవం. ముఖ్యంగా ఎన్నో వేల ఏళ్ళ నుంచి ఉంటున్న పక్షులు, ఇతరత్రా జీవజాతులు మనకు కనపడకుండా పోతున్నాయి. ప్రధానంగా కాలుష్యం పెరగడంతో అనేక పక్షులు అంతరించిపోవడం ఆందోళన కలిగిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం.
తాజాగా ఒక విషయం వెల్లడైంది… 1970 నుంచి జరుపుతున్న పరిశోధనల్లో ఆందోళనకర విషయం బయటపడింది. అమెరికా, కెనడాల్లో 1970తో పోలిస్తే ఇప్పుడు మూడు వందల కోట్ల పక్షులు తగ్గిపోయాయని, అంటే పక్షుల సంఖ్య 29 శాతం క్షీణించిందని ఉత్తర అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం చెప్తుంది. అనేక అరుదైన జాతులు అయితే కనపడకుండా పోయాయి అంటూ ఆ అధ్యయనం ఆందోళనకర విషయాలు చెప్పింది. ఇంటి పెరట్లో నిత్యం కనిపించే పక్షులు, సాధారణ జాతుల పక్షులు, మానవ ఆవాసాలకు అలవాటు పడ్డ పక్షులు,
భారీగా తగ్గిపోయాయి అనేది ఆ అధ్యయనం క్లుప్తంగా వివరిస్తుంది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం, చెస్టర్ జూలో పీహెచ్‌డీ విద్యార్థి హ్యారీ మార్షల్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇండోనేషియాలో పాడే పక్షుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, దీనికి కారణం భూతాపం, పెరుగుతున్న కాలుష్యమేనని అధ్యయనంలో వెల్లడైంది. ఇక తుఫాన్ల కారణంగా ఉత్తర అమెరికాలో చాలా వరకు అరుదైన జాతుల పక్షాల జాడే లేకుండా పోయిందని ఈ అధ్యయనం చెప్తుంది.