ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు

-

ప్రజా భవన్‌కు డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని  సీఎం రేవంత్ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిందని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు అభ్యర్థులు  వెల్లడించారు.
తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1,399 మంది డీఎస్సీ 2008 బాధితులు ఉన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో తమకు న్యాయం జరగలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version