ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలోకి రావడానికి విడదల రజిని ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విడదల రజిని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఆమె విషయంలో కొన్ని కొన్ని ఆసక్తికర చర్చలు గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. తనకు మంత్రివర్గంలో కి వెళ్లడం ఇష్టం లేదని తనకు నామినేటెడ్ పదవి కావాలని ఆమె కోరుతున్నట్లుగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆర్ కే రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నారు. ఆ పదవిని విడదల రజిని అప్పగించి ఆర్ కే రోజా ను క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలతో కూడా జగన్ చర్చించారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు రోజా. అయితే ఆమెకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి మద్దతు ఎక్కువగా ఉంది.
అలాగే మరో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఆమెను మంత్రి కావాలని కోరుతున్నారు. ఇక తిరుపతి పార్లమెంటు ఎన్నికల కోసం కూడా ఆర్ కే రోజా తీవ్రంగా కష్టపడుతున్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి ఆమె ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో సంబంధం లేకుండా ఆమె ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.