లాక్ డౌన్ లో విజయ్ ఏం చేస్తున్నాడో చూడండి…!

-

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మొదలుపెట్టిన #BeTheRealMan ఛాలెంజ్ టాలీవుడ్ ప్రముఖులలో విపరీతంగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, ఎస్.ఎస్.రాజమౌళి, వెంకటేష్ ఈ ఛాలెంజ్ ని స్వీకరించి తాము ఇంట్లో ఏం చేస్తున్నాం అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాజాగా సందీప్ మొదటి హీరో విజయ్ దేవరకొండ కూడా దీనికి స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ చిత్రీకరించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “నా రోజు బిట్స్ లాక్డౌన్ ఆనంద్ దేవరకొండతో డాక్యుమెంట్ చేయబడిందని పేర్కొన్నాడు. వీడియోలో, విజయ్ దేవరకొండ ఉదయం 11:45 గంటల వరకు నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు. లాక్డౌన్ సమయంలో అతని సగటు నిద్ర సమయం తొమ్మిది గంటలు 30 నిమిషాలు అని చెప్పాడు.

ఆ తర్వాత తన కుటుంబం కోసం మామిడి ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు. బోర్డు గేమ్ ఆడుతున్న తన తల్లి మరియు సోదరుడికి ఐస్ క్రీం వడ్డించడం ఈ వీడియో లో కనపడుతుంది. తన దినచర్యలతో పాటు ప్రేక్షకులకు కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను కూడా ఇచ్చాడు. వైన్ / ఆల్కహాల్ బాటిల్‌ను వాటర్ బాటిల్‌గా ఉపయోగించడం మరియు పాత ప్లాస్టిక్ కవర్లను డస్ట్‌బిన్ కవర్లుగా మార్చడం గురించి చిట్కాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version