ఇండస్ట్రీ మళ్ళీ కోలుకుంటుంది ..కాని ఈ సమయంలో రైతులనే కాపాడుకోవాలి అంటున్న బోయపాటి శ్రీను ..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా బోయపాటి శ్రీను కి ఒక ఇమేజ్ ఉంది. ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ భారీగా వసూళ్ళను రాబడుతున్న విషయం తెలిసిందే. తన మొదటి సినిమా భద్ర నుంచి గత ఏడాది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన వినయ విధేయ రామ వరకు చాలా సూపర్ హిట్స్ ఇచ్చారు. గత సినిమా నిరాశని మిగిల్చింది తప్ప మిగతా సినిమాలన్ని రికార్డ్ స్థాయిలో సక్సస్ సాధించినవే. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో 106 సినిమాని తెరకెక్కిస్తున్నారు బోయపాటి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

 

ఈ సినిమాతో బాలకృష్ణ కి బోయపాటి హ్యాట్రిక్ హిట్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. అంతేకాదు ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు కి సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా ఇంట్రడ్యూస్ చేసి స్టార్ ఇమేజ్ ని ఇచ్చారు. బోయపాటి వల్లే మళ్ళీ జగపతి బాబు కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా జగపతి బాబు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూకి లో బాగంగా బోయపాటి శ్రీను మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం కరోనా కారణంగా దేశంతా నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా రైతుల గురించి వాళ్ళ పట్ల ఉండాల్సిన బాధ్యత గురించి స్పందించారు. ఇండస్ట్రీకి ఇది పెద్ద దేబ్బ అయినప్పటికి కొన్ని రోజులకి నెమ్మదిగా కోలుకుంటుంది. అంతా నార్మల్ అవుతుంది. కాని ఇప్పుడు అందరూ ఆలోచించాల్సింది రైతుల గురించి. ఈ సమయంలో వారికి అండగా నిలబడాలి… ఆదుకోవాలి. దేశంలో లో రైతులకి గనక ఇబ్బందులు వస్తే ఎవరికి తిండి దొరికే పరిస్థితి ఉండదని రైతులకి కావలసినవి సమకూర్చి తోడు నిలవాల్సిన సమయమిది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version