లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్, సమంత తో ఖుషి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. దీనితో విజయ్ ఫుల్ ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీ సమయంలో కొంత మంది దర్శకుల కథలు విన్నాడు.
![Puri Jagannath Vijay Devarakonda New Movie Title Fighter](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/08/puri-jagannath-vijay-devara.jpg)
ఈ కథలు వినే ప్రోగ్రామ్ లో గతంలో తనతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ కూడా ఉన్నాడు. తాజాగా పరశురాం తో సినిమా చేయాలని విజయ్ ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ సినిమా కు దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తారు.మొత్తానికి హిట్టు కాంబో కుదిరిందని ఇటు విజయ్ అటు దిల్ రాజు ఫుల్ హ్యపీగా ఉన్నారట.
ఇటు పరశురామ్ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.సర్కారు వారి పాట తర్వాత పరశురాం అసలైతే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు సాగలేదు. అయితే చైతన్యకు రాసిన కథనే విజయ్ దేవరకొండ ఇమేజ్ కి తగినట్టు మార్చి ఈ సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో విజయ్ దేవరకొండ అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.