ఆనాడు నువ్వు అలా చేసావు.. ఈనాడు నీకిలా జ‌రిగింది: విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్‌

-

టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. అయితే ఏపీ సర్కార్ చేసిన ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవిలా ఉంటే.. గత సంవత్సరం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు విశాఖపట్నంకు వచ్చిన వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి ఏ చట్టం కింద తిప్పి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?” అని అన్నారు. అంటే ఆనాడు నువ్వు అలా చేసావు.. ఈనాడు నీకిలా జ‌రిగింది అన్న‌ట్టు విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version