వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి మరోసారి దక్కకపోవడంపై వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య గారికి పొడిగింపు లేదన్నది బీజేపీ నిర్ణయమని విజయసాయి పేర్కొన్నారు. టీవి చర్చల్లో భారత ఖండంబు చీలిపోతుందని, ప్రజాస్వామ్యంకే అపాయం అని దుష్ప్రచారమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పచ్చ కుల మీడియా ఉడత ఊపులు విడ్డూరం, అసంబద్ధం. గౌరవ వెంకయ్య గారిని జగన్ గారే అడ్డుకున్నారన్న టీడీపీ కొత్త పల్లవి వాస్తవం కాదని తేల్చి చెప్పారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. పచ్చ కుల మీడియా పైత్యానికి, ఊహాజనిత రాతలకు హద్దేలేదు.
ఇక ప్రైవేటుకే మద్యం షాపులంటూ కట్టు కథలు వండి వార్చింది. షాపుల నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ శాపనార్థాలు పెట్టింది. బెల్టు షాపులు ఎత్తేసినప్పుడు శోకాలు పెట్టింది. ‘పచ్చ సిండికేట్’ అలాంటిది మరి! అంటూ ఫైర్ అయ్యారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.