రష్మీ-సుధీర్‌ల పెళ్లిపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్..!

-

బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ షో అయిన ‘జబర్దస్త్’లో జోడీగా చక్కటి పేరు సంపాదించుకున్నారు రష్మీ గౌతమ్ -సుధీర్. వీరి మధ్య లవ్ ట్రాక్ నిజంగానే నడుస్తున్నదనేంతలాగా వీరు బిహేవ్ చేస్తుంటారు. ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’,‘జబర్దస్త్’లకు యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తున్నప్పటికీ సుధీర్ మాత్రం సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే, సుధీర్ ఎక్కడున్నా తనపైన ప్రేమ కొనసాగుతుందనేలా రష్మీ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది.

తాజాగా గెటప్ శ్రీను..రష్మీ-సుధీర్..మ్యారేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రష్మీ గౌతమ్-సుధీర్ ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోబోరని అన్నాడు గెటప్ శ్రీను. సుధీర్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు గెటప్ శ్రీను. అయితే, సుధీర్-రష్మిలు షూటింగ్ టైమ్ లో మాత్రమే అలా ఉంటారని, ఒకసారి షూటింగ్ పూర్తయితే ఎవరి లోకంలో వారే ఉంటారని క్లారిటీనిచ్చాడు గెటప్ శ్రీను.

వెండితెరపైన కేవలం కామెడీ పంచడానికి అలా ప్రేమికులు అనే ముసుగును రష్మీ-సుధీర్ తొడుక్కుంటున్నారని గెటప్ శ్రీను స్పష్టం చేశాడు.

గెటప్ శ్రీను కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సుధీర్ రష్మి ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని, ఇది సరికాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇటువంటి నిజాలు తెలిసినప్పటికీ సుధీర్-రష్మీల జోడీ చూడ ముచ్చటగా ఉంటుందని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version