ఏపీలో‘అప్రకటిత ఎమర్జెన్సీ’.. విజయసాయి రెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు

-

చంద్రబాబుపై మరోసారి విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు.తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చి ప్రజల బాగోగులు కనుక్కుందామనకున్నారట అంటూ చురకలు అంటించారు. ఆ పనేదే ఆయన కుప్పం గ్రామాల్లో ప్రశాంతంగా చేసుకోకుండా అనవసరంగా పాలకపక్షంపైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిపైనా రంకెలేస్తున్నారన్నారు.

 

‘ఫెయిల్డ్‌ సీఎం’ అని నిర్ధారించిన ఈ మాజీ ముఖ్యమంత్రి– ఏపీ పరిపాలనకు సంబంధించి ఏఏ రంగాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందో చెప్పడం లేదు. నిరాధారమైన నిందలేస్తూ ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఆంధ్రప్రదేశ్‌ లో అమలులో ఉందనే పసలేని ఆరోపణలతో జనం సానుభూతి కోసం ఆయన వెంపర్లాడుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో చక్కగా ప్రవర్తించారంటూనే– తాను మాత్రం ప్రస్తుత సీఎంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.

 

 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపానికి తాను పాలకపక్షంపై ఎంత అడ్డుగోలు విమర్శలకు తెగబడినా.. ఏం కాదనే ధీమా నారా వారిలో కనిపిస్తోంది. ఆయన చెప్పుకుంటున్నట్టు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు అనరాని మాటలు అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. కుప్పంలో కూర్చుని తన విష ప్రచారంతో ఆంధ్రప్రదేశ్‌ లోని మిగిలిన 174 నియోజవర్గాల ప్రజలను మాయచేసి, బురిడీ కొట్టించాలని ఆయన పన్నాగాలు పన్నుతున్నట్టు కనిపిస్తోందన్నారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version