టాలీవుడ్ దర్శకుడు బండ్ల గణేష్ ట్వీట్ కు వైసీపీ నేత, రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ ఓ వీధి కుక్క..నీదో బతుకా అంటూ విజయసాయి ఆగ్రహించారు. ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావంటూ విజయసాయి మండిపడ్డారు.
మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!అంటూ చురకలు అంటించారు. ఇక అంతకు ముందు విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి కాదు…నువ్వు విష సాయి అంటూ ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా… రెండు రోజులు ఊపేసి పోయింది… దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అని మండిపడ్డారు.
అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయమని హెచ్చరించారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేమని… విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు…ఇది ప్రపంచానికి తెలుసు అని ఆగ్రహించారు.