పోర్టులు, రహదారులే ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి మూలస్తంభాలు – విజయసాయిరెడ్డి

-

పోర్టులు, రహదారులే ఆంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధికి మూలస్తంభాలు అన్నారు విజయ సాయిరెడ్డి. దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఓడరేవులు, వాటికి అనుసంధానమైన రహదారులు కీలకపాత్ర పోషిస్తాయనేది జగమెరిగిన వాస్తవం. దేశంలో గుజరాత్‌ తర్వాత అతి పొడవైన సముద్ర తీరం (975 కి.మీ) ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోని నౌకాశ్రయాలు రాష్ట్ర ఆదాయం పెంచడానికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తున్నాయని తెలిపారు.

ముంబై, చెన్నైతో పోటీగా విశాఖపట్నం అభివృద్ధి సాధించడానికి కారణం ఈ రెండు మహానగరాల్లో మాదిరిగానే విశాఖలో సకల సౌకర్యాలున్న పోర్టు ఉండడమే. రేవు పట్టణాలు ఎప్పుడూ అవి ఉన్న రాష్ట్రాలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించడానికి దోహదం చేస్తాయి. నాలుగేళ్ల నుంచీ రాష్ట్ర ప్రభుత్వం నౌకాశ్రయాల అభివృద్ధి, కొత్త పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించింది. ఏపీ తూర్పు తీరంలో వరుసగా ఏర్పాటయ్యే అనేక పోర్టుల ద్వారా దాదాపు పది కోట్ల టన్నుల సరుకుల ఎగుమతులు, దిగుమతుల జరిగేలా చూడడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ఏడాది క్రితమే వెల్లడించిందని తెలిపారు.

నౌకాశ్రయాలకు తోడు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వల్ల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అందుకే మొదటి నుంచీ బంగాళాతం తీరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి పోర్టుల సామర్ధ్యం పెంచడం, కొత్తవి నిర్మించడమే సర్కారు ప్రధాన లక్ష్యంగా మారింది. రాష్ట్ర సముద్ర తీరంలో ప్రతి 50 కిలో మీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ పనిచేసేలా చూసి రాష్ట్ర ప్రజలకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిందని వివరించారు విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version