ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరుతున్నాం అన్నారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనంతపురంలో జరిగిన ఏపీ ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తమ ముందున్న ద్యేయం అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతున్నామని తెలిపారు.
చంద్రబాబు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఎమ్మార్పీఎస్ అండగా నిలిచింది. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం యావత్ దళితులు అహర్నిశలు కష్టపడ్డారు. ఇదే విషయం ఎన్నో సభల్లో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి నేతలను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా యావత్ మాదిగ జాతి అండగా నిలిచిందని గుర్తు చేశారు ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.