అశోక్ గజపతిరాజు పెద్ద దొంగ..జైలుకి వెళ్లడం ఖాయం : వైసీపీ ఎంపి

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన చేసిన పెద్ద దొంగ అశోక్ గజపతిరాజు అని.. అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని ఆరోపించారు. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం ఖాయమని.. మాన్సస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామన్నారు. అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారని.. సుప్రీంకోర్టు లింగ వివక్ష చూపించ వద్దని గతంలో తీర్పు నిచ్చిందని గుర్తు చేశారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రవేశంపై లింగ వివక్ష పాటించ వద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అశోక్ గజపతిరాజు మహిళలపై లింగ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.

పురుషులతో పాటు మహిళలను సీఎం జగన్ మోహన్ రెడ్డి సమానంగా గౌరవిస్తారని తెలిపారు. భూకబ్జా వ్యవహారాల్లో టిడిపి నేతలు తాత్కాలికంగా కోర్టులు నుంచి స్టే తెచ్చుకోగలరని.. కానీ చేసిన తప్పుకు శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి నుంచి వదిలిపెట్టేది లేదని.. కోర్టులు, జడ్జిలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొనమని చెప్పవని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version