డల్లాస్ అంటే ఇదేనా సారూ ? : హైదరాబాద్‌ వరదలపై రాములమ్మ ఫైర్‌

-

డల్లాస్ అంటే ఇదేనా సారూ ? అని హైదరాబాద్‌ వరదలపై విజయశాంతి ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎక్కడ చూసినా వరదనీరే… రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా… ప్రజలు కొన్నిచోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.


హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తనని చెప్పిన ముఖ్యమంత్రి సారూ… మీరు చెప్పిన డల్లాస్ అంటే ఇదేనా? హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంటే… మీరు మాత్రం ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? కనీసం మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా తప్పించుకుని తిరుగుతున్నరు. ఇంకా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిందని పేర్కొన్నారు.

కానీ ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక మొన్నటి వరకు భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయితే… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం భద్రాచలంలోనే నష్టం జరిగినట్టు చూపిస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోంది. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నరు. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విజయశాంతి మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version