మహిళా వీఆర్ఏ చీర లాగిన టీఆరెస్ కార్యకర్త..రాములమ్మ ఆగ్రహం

-

ఓ టీఆరెస్ కార్యకర్త… మహిళా వీఆర్ఏ చీర లాగిన ఘటనపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితులు నీచాతినీచంగా దిగజారిపోతున్నయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మహిళా వీఆర్ఎపై జరిగిన దుశ్శాసన పర్వం ఇందుకు పెద్ద ఉదాహరణ. ఇసుక అక్రమాల గురించి అధికారులకు సమాచారం ఇస్తున్నరన్న కోపంతో బస్సులో ఉన్న మహిళా వీఆర్ఏని ఒక టీఆరెస్ కార్యకర్త దారుణంగా అవమానించాడని నిప్పులు చెరిగారు.

ఆ వీఆర్‌ఏని చీర పట్టి గుంజి, జుట్టుపట్టి లాగాడు. ప్రయాణికుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించాడు. ట్రాక్టర్‌తో చంపేస్తానని బెదిరించాడు, ముఖం, చర్మం ఎర్రబడేలా కొట్టాడు. అధికార పార్టీయే కాదు…. యావత్ తెలంగాణ సిగ్గు పడేలా జరిగిన ఈ ఘటనలో నాగ మల్లయ్య అనే ఆ టీఆరెస్ కార్యకర్తను కాపాడేందుకు పోలీసులు కూడా ముందుకు రావడం దిగ్భ్రాంతి కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దాడిపై సదరు వీఆర్ఏ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ టీఆరెస్ కార్యకర్త అక్కడకి కూడా వచ్చి ఆమెను చంపేస్తానని బెదిరించాడంటే రాష్ట్రంలో మహిళా రక్షణ, చట్టాల అమలు ఎంత గొప్పగా ఉన్నయో అర్థమవుతోంది. ఆమెపై జరిగిన దాడి గుర్తుగా దెబ్బలు కళ్ళకు కనబడుతున్నా పోలీసులు ఆ టీఆరెస్ కార్యకర్తని కొద్దిసేపు ఉంచి పంపేశారని మీడియా వెల్లడించింది. కేసీఆర్ పాలన ఎంత గొప్పగా ఉందో ఇంతకంటే చెప్పాల్సిన పనిలేదని మండిపడ్డారు విజయశాంతి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version