చెరువుల‌ను మింగుతున్న టీఆర్ఎస్ ను బంగాళ ఖాతంలో కలపడం ఖాయం – విజ‌య‌శాంతి

-

చెరువుల‌ను మింగుతున్న టీఆర్ఎస్ ను బంగాళ ఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు చెరువుల‌ను మింగేస్తున్నారని.. తెలంగాణ అంతటా ఇదే ప‌రిస్థితి. తాజాగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయని నిప్పులు చెరిగారు. జిల్లాలో 1,147 వరకు చెరువులు ఉండగా వీటి పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆక్రమణలతో చెరువు పరిధి, నీటి సామర్థ్యం తగ్గి సాగు విస్తీర్ణంపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. కేసీఆర్ ఓ వైపు సాగునీటి వనరుల అభివృద్ధి పేరుతో క‌మిష‌న్లు దండుకుంటే.. మరోవైపు అధికార పార్టీ లీడర్లు రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి చెరువులను కబ్జా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌లో 98 ఎకరాల్లో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో దాదాపు 8 ఎకరాలను కబ్జా చేసేశారు. నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే 44 పక్కనే 35 ఎకరాల్లో ఏదుల్లా చెరువు ఉంది. ఇందులో 30 శాతం కబ్జాకు గురైంది. అధికార ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో కబ్జాకు గురైన భూమికి కన్వర్షన్లు కూడా లభిస్తున్నయి. దీని గురించి పైఆఫీసర్లకు కూడా ఫిర్యాదు అందినా…. క‌బ్జాదారుల‌పై వారు ఏ చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేదు. జిల్లాలోని మొత్తం 1,147 చెరువుల్లో15 శాతం అంటే…161 చెరువులు కబ్జాల పాలవుతున్నట్టు ఇటీవల పలు సర్వేల్లో తేలిందని విమర్శించారు. చెరువుల‌ను య‌థేచ్చ‌గా మింగుతున్న టీఆర్ఎస్ నాయ‌కుల‌కు తెలంగాణ ప్ర‌జానీక‌ం త‌గిన విధంగా బుద్ధి చెప్ప‌డం ఖాయమన్నారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version