తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: విజయశాంతి

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి ఆరోపించారు. తాజాగా ముంచెత్తుతున్న వరదలే ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాద్​ నగరాన్ని ఎలాగూ కాపాడలేకపోతోందని, ఇప్పుడు ప్రభుత్వ చేతగాని తనానికి వరంగల్ కూడా బలైందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందో చెప్పకనే చెబుతున్నారని… కోటి పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనను ఏవిధంగా చూడాలని ప్రశ్నించారు.

vijaya shanthi

తెలంగాణలో రాష్ట్రంలో అత్యంత ప్రధానమైనదీ… కొవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా పట్టించుకోలేదని వాపోయారు. అగ్నిమాపక వ్యవస్థ నీరుగారిందనన్నారు. ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీస స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి నెలకొందని విజయశాంతి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version