వైసిపి నేత వల్లభనేని వంశీకి మరో ఊహించని షాక్ తగిలింది. వైసిపి నేత వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించింది విజయవాడ కోర్టు. తాజాగా… వల్లభనేని వంశీ రిమాండ్ పై విజయవాడ ఎస్సీ అలాగే ఎస్టి కోర్టు.. విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ రిమాండ్ పొడగించింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్ట్. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాల్టితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసింది.
అయితే వంశీ నీ జూమ్ యాప్ ద్వారా… విజయవాడ ఎస్సీ ఎస్సీ కోర్టు న్యాయమూర్తి విచారించారు. ఈనెల 25వ తేదీ వరకు వల్లభనేని వంశీ రిమాండ్ తొలగిస్తున్నట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో వల్లభనేని వంశీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఇలా ఉండగా గత నెలలో… వల్లభనేని వంశి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు పోలీసులు.