24 క్యారెట్ బంగారం మహేశ్ బాబు – కారణం ఉంది : విజయశాంతి స్పీచ్ అదుర్స్

-

“మహేశ్ బాబు దగ్గర నుంచి టీం లో ప్రతీ ఒక్కరికీ నా థాంక్స్ చెబుతున్నాను .. ఈ ఈవెంట్ కి విచ్చేసిన అభిమానులు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను .. 1979 నుంచి 2020 వరకూ నా సినిమా ప్రయాణం జరిగింది .. నన్ను ఆ స్థాయి కి తీసుకువెళ్ళిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు .. మర్చిపోలేని జర్నీ ఇది . యాక్షన్ సినిమా ల దగ్గర నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ తో సహా అనేక సినిమాలు చేశాను .. ” అంటూ తన స్పీచ్ ని స్టార్ట్ చేసిన విజయశాంతి .. ఆడవారి కోసం ఊపిరి ఉన్నంతవరకూ పోరాడతాను అన్నారు ఆమె.

“1988 లో లిటిల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు .. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంతే క్యూట్ గా కందిపోతాడు అనేలా ఉంటాడు మహేశ్ .. అప్పట్లో అతనితో యాక్ట్ చేసి మళ్ళీ ఆయన తో ఇప్పుడు చెయ్యడం సంతోషం గా ఉన్నాను .. కృష్ణ గారే నన్ను తెలుగు సినిమా కి పరిచయం చేశారు .. నాకింత బలం ఇచ్చి దారి చూపించింది వాళ్ళే .. సక్సెస్ఫుల్ హీరోగా కృష్ణ గారి గురించి చెబుతాను ఇప్పటికీ … మళ్ళీ రీ ఎంట్రీ మహేశ్ తో అవడం సంతోషంగా ఉంది.. 24 క్యారెట్ బంగారం మహేశ్ బాబు అసలు .. జెంటిల్ మ్యాన్ లాంటి మనిషి .. సూపర్ స్టార్ అనే దానికి అర్ధం ఆయన కి సరిగ్గా సరిపోతుంది .. ” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు విజయ శాంతి.

 

” కొత్తదనం కావాలి అని ప్రతీ సినిమా కి ట్రై చేస్తారు .. సరిలేరు నీకెవ్వరు సినిమా చాలా కొత్తగా ఉంటుంది .. డాన్సులు , ఫైట్ లు రెచ్చిపోయాడు మహేశ్ బాబు .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్నాను .. వేలాది మందికి ఆయన ఆపరేషన్ చేయించారు .. దానికి ఆయన బంగారం .. అందుకే ఆయన బయట కూడా సూపర్ స్టార్ ” అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version