నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుల వివక్ష కట్టలు తెంచుకుంది. వంద కుటుంబాలను బహిష్కరణకు గురయ్యేలా చేసింది. జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామంలో వడ్డెర కులస్తులపై అరాచకం జరిగింది. వంద కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేస్తూ మునిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో బాధితులు కలెక్టర్ ను ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే, వడ్డెర కులస్తుల శ్మశానంలోని మొరం తవ్వుకున్నందుకు వడ్డెర కులస్తులు అడ్డు పడ్డారు.
ప్రస్తుతం దాన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మొత్తం 100 మంది కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసినట్లు తెలుస్తుంది. అదే కాదు వాళ్ళతో ఎవరు మాట్లాడినా నిత్యావసర వస్తువులు ఇచ్చినా 10వేల రూపాయల జరిమానా విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వివాదం కలెక్టర్ వరకూ వెళ్ళింది. మరేం జరుగుతుందో చూడాలి.