భారతదేశంలో ఎక్కువైన వైరల్ జ్వరాలు.. పిల్లల్ని ఇలా సురక్షితంగా ఉంచండి..!

-

భారతదేశంలో చిన్నపిల్లల్లో వైరల్ ఫీవర్ ఎక్కువగా వ్యాపిస్తోంది ఉత్తరప్రదేశ్, ఫిరోజాబాద్ మరియు మథుర లో గత నెల నుండి కూడా వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది చూస్తే… సాధారణంగా ఆరు నుండి ఎనిమిది ఏళ్ల పిల్లల్లో రెస్పిరేటరీ సమస్యలు సంవత్సరంలో వస్తా. కరోనా మహమ్మారి ప్రభావం కూడా పడి ఉండొచ్చు.

 

అదే విధంగా శుభ్రం లేని నీళ్లు, పాడైపోయిన ఆహారం తినడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. దోమల కారణంగా డెంగ్యూ మరియు చికెన్ గునియా వ్యాధులు కూడా సంభవిస్తాయి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు మొదలు ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే వైరస్లతో పాటు డెంగ్యూ కేసులు కూడా నమోదు అవుతున్నాయని డాక్టర్ మీనా చెప్పారు.

అలానే ఆకాష్ హెల్త్ కేర్ ద్వారక జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి వంటివి పిల్లల్లో చూశామని చెప్పారు. చాలామందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతుందని అన్నారు డాక్టర్. అలానే ఈ డిసీజెస్ అనేవి జూలై నుండి నవంబర్ వరకు వస్తూ ఉంటాయని చెప్పారు. గత సంవత్సరాలలో చూసుకున్నట్లయితే జనవరి ఒకటి మరియు సెప్టెంబర్ 4 మధ్య ఢిల్లీలో 124 కేసులు నమోదయ్యాయి. అలానే 771, 829, 137, 122 మరియు 96 కేసులు 2016, 17, 18, 19, 20 లో నమోదయ్యాయి. 2016, 17 లో చూసుకున్నట్లయితే సంవత్సరానికి 10 మంది చనిపోయారు.

పిల్లలని ఎలా ప్రొటెక్ట్ చేయాలి…?

పిల్లలకి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దోమలు కుట్టకుండా క్రీములు వంటివి పిల్లలకు రాసి సురక్షితంగా ఉంచాలి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను పిల్లలకు అసలు పెట్టొద్దు.

ఎప్పుడు పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలి..?

మూడు నుండి నాలుగు రోజుల పాటు తగ్గకుండా జ్వరం వచ్చినా లేదు అంటే అరుదైన లక్షణాలు కనబడిన హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. 103 లేదా 104 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఆస్పత్రిలో చేర్చాలి. కడుపునొప్పి, ర్యాషెస్ వంటి సమస్యలు కలిగినా ఆస్పత్రిలో చేరడం మంచిదని డాక్టర్ గుప్తా చెప్తున్నారు. ఆస్పత్రికి తీసికెళ్తే డాక్టర్ వైద్యం చేస్తారని అవసరమైన మందులతో తగ్గిస్తారు అని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version