వినాయక చవితి స్పెషల్‌.. బెల్లం కుడుములు తయారీ విధానం

-

ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు అంటే గణేషుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. వీటి తయారీలో నూనె వాడరు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇప్పటి వరకు మనం ఎన్నో వంటకాలు నేర్చుకున్నాం. ఇప్పడు వినాయ చవితి రోజున గణనాథుడికి తప్పనిసరిగా సమర్పించే నైవేద్యాల్లో ఒటైన బెల్లం కుడుములు తయారుచేసే పద్ధతి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

బియ్యం పిండి – అర కప్పు
తురిమిన బెల్లం – అర కప్పు
ఎండుకొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్స్‌
యాలకుల పొడి – ఒక టీ స్పూన్‌
నెయ్యి – ఒక టీ స్పూన్‌

తయారు చేసే విధానం :

అర కప్పు నీళ్ళను మరగించి దాంట్లో బెల్లాన్ని వేయాలి. పూర్తిగా కరిగేవరకు మరిగించాలి. దాంట్లో యాలకుల పొడి, బియ్యం పిండి వేసి ముద్దలు కట్టకుండా కలపాలి. చపాతీ పిండిలా అయ్యేట్లు చూసుకోవాలి. కొన్నిసార్లు బియ్యం పిండి నీళ్ళను ఎక్కువగా లాగుతుంది. అందుకే కలిపేటప్పుడు గట్టిగా అయ్యేలా ఉంటే పిండి కలపడం ఆపేయొచ్చు. ఈ మిశ్రమాన్ని దించేసి చిన్న, చిన్న ఉండలుగా కానీ, గారెల్లాగా కానీ చేసుకోవాలి. అన్నింటినీ స్టీమర్‌లో పెట్టి ఆవిరిపై ఉడికించాలి. పై నుంచి కొబ్బరి తురుము చల్లుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version