క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఫోటోలు…!

-

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి టి20 లో టీం ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 5 మ్యాచుల సీరీస్ లో టీం ఇండియా అన్ని మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక ఈ సీరీస్ లో కివీస్ జట్టుని దురదృష్టం వెంటాడింది. హా కాదు లే దరిద్రం వెంటాడింది. ఏదొకటి గాని ఆ జట్టు మాత్రం ఇప్పుడు చాలా బాధపడుతుంది. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది.

రెండు సూపర్ ఓవర్స్ లో ఓడిపోయింది. దానికి తోడు, విజయ౦ వరకు వచ్చి ఓటమి పాలైంది ఆ టీం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కలిసి బౌండరీ లైన్ వద్ద కూర్చుని మ్యాచ్ గురించి చర్చిస్తూ సరదాగా గడిపారు.

ఇద్దరు నిన్నటి మ్యాచ్ కి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అంటే ఇలా ఉండాలని, జట్టు ఓడిపోయినా సరే విలియంసన్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా క్రికెట్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ఆరోగ్యకరమైన క్రికెట్ అంటే ఇది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ సందర్భంగా వచ్చిన కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version