ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే నెపంతో ప్రాణాలు పణంగా పెడుతున్నారు. దీంతో ఈజీగా సోషల్ మీడియాలో వీవ్స్ సంపాదించుకోవచ్చనే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వేసిన స్టంట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. జాతీయ రహదారిపై కారులో ఓ వ్యక్తి వేగంగా వెళ్తుండగా కారు డోరు తెరిచి విన్యాసాలు చేశాడు. దీంతో ఆ కారు అదుపు తప్పింది.
డివైడర్ పైనుంచి అవతలి రోడ్డుపై ఎగిరిపడి రేలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన చంఢీఘడ్-సిమ్లా జాతీయ రహదారిపై జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన ఓ డ్రైవర్ కారులో విన్యాసాలు చేశాడు. అదే సమయంలో మరొక కారు ఢీకొట్టడంతో డివైడర్ పైనుంచి కారు పల్టీ కొట్టింది. కారు తుక్కు తుక్కైంది. వేగంగా కారు నడపడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు డ్రైవర్‌పై కేసు పెట్టారు.
#WATCH | HP: A video went viral showing a car jumping over a divider & colliding with railing on NH-5 in Solan; a resident from Amritsar tried performing stunts while rash driving. Vehicle damaged but driver safe. Case filed u/s 279 of IPC in Dharampur PS: Solan Police (25.07) pic.twitter.com/o5ajWRJuiG
— ANI (@ANI) July 25, 2022