సహజంగా పాములంటే ప్రతి ఒక్కరికీ భయం. పాములను చూస్తేనే చాలు అక్కడి నుంచి లగెత్తుకుని పారిపోతుంటాం. పాముల్లో అతి పెద్దవి అనుకొండ. వీటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోవాల్సిందే. కొండ చిలువలు మనిషి శరీరం కంటే పెద్ద వాటిని కూడా మింగగలవు. కొండ చిలువలను దూరం నుంచి చూస్తే చాలు ఎంతో భయపడతాం. అలాంటిది ఓ వ్యక్తి పాముల మధ్యలో ఉంటాడు. అతడిపై ఎన్నో కొండ చిలువల గుంప పడినా అదరడు.. బెదరడు..
ఇలాంటి భయంకరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్వాలేడీ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. దీనికి ‘’50 మిలియన్ల డాలర్ల కోసమైనా ఒక గంట ఉండగలరా..’’ ఉంటూ క్యాప్షన్ పెట్టింది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతూ.. లైక్ చేస్తున్నారు.
CAN YOU SPEND 1 HOUR INSIDE HERE FOR 50 MILLION DOLLARS??? pic.twitter.com/WP8Rt4rT6W
— Aqualady𓃤 𓅇 𓅋 𓆘 (@Aqualady6666) February 3, 2021
ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. విషం లేని పాములని.. మేము కూర్చొగలమని, ఏ డాలర్ తీసుకోకుండానే నేను ఆ పని చేయగలను అని కొందరూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. ఇది నాకు పెద్ద విషయమే కాదని, ఒక్క సెకన్ కూడా ఉండలేను, అస్సలు ఉండను, కలలో వెళ్లి పాములతో ఉండి వస్తా.. అంటూ డిఫరెంట్‌గా కామెంట్లు పెడుతున్నారు.