ఫ్లోరిడాలోని ఒక హోటల్‌లో స్విమ్మింగ్ ఫూల్ లో మునిగిపోయిన కారు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెస్ట్ పామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ జనవరి 4 న ఫేస్బుక్లో ఒక స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హోటల్ కొలనులో మునిగిపోయిన నల్ల కారు కనపడింది. దాన్ని చూసి నెటిజన్లు కంగు తిన్నారు.
కానీ అది సరిగ్గా అక్కడ ఎలా దిగింది? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. “కృతజ్ఞతగా, ఎవరూ గాయపడలేదు. హోటల్ పూల్ లోకి అనుకోకుండా వెనక్కి తిరిగి వచ్చిన తరువాత డ్రైవర్ మరియు ప్రయాణీకుడు తప్పించుకున్నారు” అని పేర్కొంటూ పోలీసు శాఖ ఫోటోలను పంచుకుంది. కార్ పూలింగ్‌కు కొత్త నిర్వచనం ఇస్తున్నాయి ఈ ఫోటోలు అంటూ పలువురు కామెంట్ చేసారు.
దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు కాబట్టి అక్కడ పార్క్ చేసి ఉంటారని కొందరు కామెంట్ చేయగా ఆ కారు జీవం లేకపోయినా స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తుందని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే కారు కి గర్ల్ ఫ్రెండ్ ని చూస్తే ఇద్దరు కలిసి ఫూల్ లో ఎంజాయ్ చేస్తారని కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.