వైరల్: ఉబర్‌ డ్రైవర్‌పై మహిళ దాడి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!?

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోం సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ వైరస్ బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇక కరోనా సమయంలో మాస్క్‌ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్‌ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్‌ వేసుకోవాడన్ని లేక్క చేయకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు.

women

ఇక తాజాగా ఓ ఉబర్‌ డైవర్‌ తన కారులో ప్రయాణిస్తున్న మహిళను మా​స్క్‌ ధరించాలని కోరగా ఆమె అతనిపై దాడికి దిగి, అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సుభాకర్ ఖాడ్కా అనే ఉబర్‌ డ్రైవర్‌ ఆదివారం బేవ్యూ ప్రాంతంలో ముగ్గురు మహిళలను తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న ముగ్గురు మహిళల్లో ఓ మహిళ మాస్క్‌ ధరించలేదు. దీంతో ఉబర్‌ డ్రైవర్‌ సదరు మహిళను మాస్క్‌ ధరించాలని కోరాడు. దీంతో ఆ మహిళ కోపంగా డ్రైవర్‌ మీదకు వెళ్లుతూ కావాలని దగ్గటం ప్రారంభించింది.

అంతటితో ఆగకుండా తీవ్రంగా అరుస్తూ అతని మాస్క్‌, మొబైల్‌ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళలు తమ గమ్యస్థానంలో కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఉబర్‌ సంస్థ ఇక సదరు మహిళకు ఉబర్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డ్రైవర్‌ సుభాకర్ ఖాడ్కా మాట్లాడుతూ.. ఆ మహిళ కారులో తనపై పెప్పర్‌ స్ప్రే చల్లిందని తనకు శ్వాస తీసుకోవాడనికి చాలా ఇబ్బంది అయినట్లు తెలిపాడు. తనది నేపాల్‌దేశామని, ప్రయాణికులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపాడు. తనది నేపాల్‌ దేశమని ఆ మహిళలు వివక్ష చూపి, దాడికి చేశారని ఆవేదన​ వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version