Asia Cup 2022 : టీమిండియా జట్టు ప్రకటన..కోహ్లీ ఎంట్రీ

-

ఆసియా కప్ 2022 కోసం.. టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ జట్టులో కీలక ప్లేయర్లు అందరూ ఎంపిక అయ్యారు. ఈ టోర్నీ మొత్తానికి రోహిత్‌ శర్మనే కెప్టెన్‌ గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

అలాగే.. విరాట్ కోహ్లీ మరియు KL రాహుల్ రాబోయే ఆసియా కప్ 2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. మాజీ కెప్టెన్ కోహ్లీ, వెస్టిండీస్‌తో ముగిసిన సిరీస్ నుండి విశ్రాంతి తీసుకోగా, కేఎల్‌ రాహుల్ గాయంతో పోరాడి తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా  ఆసియా కప్ టోర్నీ ఆగస్ట్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు ఇవే..

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Exit mobile version