విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో దీనిని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి – భోగాపురం గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని అనేక రకాల విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉండగా… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మహిళలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. అందులో ఉచిత బస్సు పథకం ఒకటి. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఏపీవ్యాప్తంగా ఉచితంగా బస్సులలో తిరిగే అవకాశాలను కల్పించారు. ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ పొందుతున్నారు. ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకోవడంతో మహిళలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.