ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడవసారి బార్ల లైసెన్స్ గడువును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల వరకు బార్ల లైసెన్స్ దరఖాస్తులకు అవకాశాన్ని కల్పించింది. 18వ తేదీన లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేయనుంది. మొత్తం 840 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినా… 412 బార్లకే లైసెన్సులు ఖరారు అయ్యాయి.

మిగిలిన బార్లకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో… రీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు బార్లకు సంబంధించి గడువు పెంచారు. ఇప్పుడు మూడోసారి బార్ల లైసెన్స్ కు గడువు పెంచారు. రెండు సార్లు గడువు పెంచినప్పటికీ బార్లను కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మూడవసారి గడువును పెంచారు.