తల్లుల చేతుల్లో పిల్లలు విగత జీవులుగా, విశాఖలో దారుణం…!

-

ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖ సాగర తీరం ఇప్పుడు కన్నీటి ఘోషతో అల్లాడిపోతుంది. వేలాది మంది ఇప్పుడు గ్యాస్ లీకేజీ తో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రతికి ఉండగా నరకం చూస్తున్నారు. 5 కిలోమీటర్ల మేర గ్యాస్ లీకేజ్ కావడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసారు. ఈ క్రమంలో వేలాది మంది రోడ్ల మీద పడిపోయారు. చిన్న చిన్న పిల్లలు వృద్దులు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు.

ఇక ఈ సంఘటనలో వేలాది మంది పిల్లలు శ్వాస ఇబ్బందులతో అల్లాడుతున్నారు. పాపం పుణ్యం తెలియని వేలాది మంది చిన్నారులు తల్లుల చేతుల్లో ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో ఇప్పుడు తల్లుల కడుపు కోత వినపడుతుంది. ఏ ఆస్పత్రి చూసినా సరే ఆవేదనతో కన్నీళ్ళ తో కనపడుతుంది. వేగంగా చర్యలు చేపట్టినా సరే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు.

గ్యాస్ లీకేజీ తో వేలాది మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక వ్రుద్దులు కూడా ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు వదిలి పారిపోయారు చాలా మంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చాలా మంది ఇళ్ళల్లో తలుపులు వేసుకుని ఉండటంతో ఎంత మంది చనిపోయారు అనేది తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version