ఇక నుంచి జోమాటోలో మద్యం డెలివరి…!

-

లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు కొంత మంది మద్యం కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మద్యం షాపులకు అనుమతులు ఇచ్చినా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మద్యం దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంది. ఈ తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మద్యం పంపిణీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కిరాణా సరుకులను ఈ సంస్థ ఇప్పటికే అందిస్తుంది.

మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసి వేసారు. కొన్ని నగరాల్లోని కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ మద్యం ని సరఫరా చేసే ప్రయత్నాలు జోమాతో చేస్తున్నట్టు సమాచారం. ఇక అనుమతులు ఇచ్చిన ప్రాంతాల్లో వేలాది మంది క్యూలో ఉంటున్నారు. సామాజిక దూరాన్ని కూడా జనం పాటించడం లేదు. దీనితో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసే పరిస్థితి వచ్చింది.

పలు రాష్ట్రాల్లో మద్యం ధరలను భారీగా పెంచినా సరే ప్రజలు మాత్రం కట్టడి కావడం లేదు. ఇండస్ట్రీ బాడీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) జోమాటో మరియు ఇతర ఫుడ్ డెలివరి సంస్థలతో మద్యం సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనితో కరోనా వ్యాపించకుండా ఉంటుంది అని అధికారులు కూడా అంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version