మంచు విష్ణు తన అదృష్టాన్ని తమిళం లో పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మంచు విష్ణు హీరో గా సురభీ హీరోయిన్ గా తెలుగు లో విడుదల అయిన ఓటర్ సినిమా ను తమిళం లో కురల్ 388 అనే పేరు తో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు లో అనుకున్నంత గా హిట్ కాకపోవడం తో తమిళం లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తుంది. దీంతో ఈ సినిమా కోసం మంచు విష్ణు చెన్నై వెళ్లనున్నాడు.
కాగ తెలుగు లో 2019 లో విడుదల అయిన ఓటర్ సినిమా ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది. అయితే ఈ సినిమా ను జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అలాగే తమన్ సంగీత దర్శకుడి గా ఉన్నాడు. పోసారి, సంపత్ రాజ్, జయప్రకాషఫ్, నాజర్ కీలక పాత్రలో కనిపించారు. కాగ ఈ సినిమా ను తమిళం లో రవి శంకర్ అనే జర్నలిస్ట్ డైలాగ్స్ రాశాడు. ఈ సినిమా ను త్వర లోనే తమిళం లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.