తమిళనాడులో ఘోరం.. కెమికల్ ప్యాక్టరీలో గ్యాస్ లీక్. ఒకరి మరణం, 11 మంది అస్వస్థత

-

తమిళనాడులో ఘోర దుర్ఘటన జరిగింది. గ్యాస్ లీస్ అయి కార్మికులు ఒకరు చనిపోగా… పదికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు జిల్లా ఈరోడ్ జిల్లా చితోడ్ సమీపంలోని బ్లీచింగ్ పౌడర్ తయారీ ప్యాక్టరీలో శనివారం లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కార్మికులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా.. మరో 11 మంది తీవ్ర అస్వస్థతలకు గురయ్యారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వ్యక్తిని స్థానిక నడుపాళయం గ్రామానికి చెందిన దామోధరన్ గా అధికారులు గుర్తించారు. ఈయన శ్రీధర్ కెమికల్స్ పేరుతో బ్లీచింగ్ పౌడర్ తయారీ యూనిట్ నడుపుతున్నాడు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీక్ కావడం వల్ల, దామోధరన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడని.. మూర్చపోయి చనిపోయాడని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఈరోడ్ జిల్లా కలెక్టర్ హెచ్ కృష్ణనున్ని తెలిపారు. ఈరోడ్ మరియు పెరుందురై అగ్నిమాపక కేంద్రాల నుండి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని టెక్నీషియన్ సహాయంతో లీకేజీని మూసివేశారు. ఘటన స్థలంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేశారు. ఈ ఘటనపై చితోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news