గంటా గారూ మీవల్ల నాకు టెన్షన్ పెరిగిపోతోంది : బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు !

-

మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మీద గంటా శ్రీనివాసరావు పై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గంటా శ్రీనివాసరావు వలన నాకు టెన్షన్ గా ఉందని అన్నారు. మీరు వెళ్తే ఎక్కడకి అయినా వెళ్ళండి, ఉంటే పార్టీలో ఉండండని ఆయన అన్నారు. ఈ విషయం పై గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేయాలని ఆయన అన్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు రాజీనామా చేస్తే మళ్ళి పోటీ చేయడానికి నేను అన్ని సర్దు కోవాలి కదా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలు రాజీనామా లు చేసి ఇతర పార్టీలోకి వెళ్తే..నాయకుల మీద గౌరవం ఉంటుందని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో భీమిలి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా 2014 ఎన్నికల్లో స్థానం మార్చి విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన వైసీపీ పంచన చేరనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్ని ఆయన ఖండించలేదు. అలా అని అవుననీ అనలేదు. దీంతో అసలు ఆయన పార్టీలో ఉంటారా ? ఉండరా ? అనేది ఇప్పటికీ అది ఆసక్తికర అంశంగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version