వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు..? : విష్ణువర్దన్ రెడ్డి

-

ఏపీలో టీడీపీ , బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మనిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని మరి చర్యలెప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు .. ఏపీ టీడీప అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండి పడుతున్నారు. అచ్చెన్నాయుడు తీరును విమర్శిస్తున్నారు.

యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు విష్ణువర్దన్‌రెడ్డి.. చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సూచించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నకు లేదన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్తే బాగుంటున్న వైఖరితో.. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు సాగుతోన్న విషయం విదితమే. ఆ మధ్య ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్‌షా వరుసగా ఏపీలో పర్యటించడం.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేయడం.. చర్చగా మారిన విషయం విదితమే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version