నిన్న దేశ రాజకీయాలు అలాగే బిజేపి పార్టీ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి రోజున ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏపీ బిజేపి పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక మీ ఊసరవెల్లి రాజకీయాలు మానండి చురకలు అంటించారు బిజేపి పార్టీ నేతలు.
రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే రాజకీయాల గురించి మాట్లాడతారు,నేతలను కలుస్తారు, ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి ఉత్తినే పిలిస్తే వెళ్ళానంటారు. ఊసరవెల్లి రాజకీయాలు మానేసి మీదృష్టిని బీజేపీ మీద నుండి మీకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడం మీద పెట్టండి అని ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి, ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తీసేసిన తాసిల్దార్ లాంటి వ్యక్తి గఉండవల్లి . మీ ఊసరవెల్లి రాజకీయాలు మానండని ఎద్దేవా చేశారు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి.