విశ్వక్ సేన్ ‘గామి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది.

కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం సమయానికి పూర్తి కాలేదు. దీంతో గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ  మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరో విశ్వక్సేన్ అఘోర పాత్రలో నటించాడు.అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ నెల 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ 5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news