విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

యంగ్ హీరోలలో చాలా వెరైటీ గా కథలను మరియు దర్శకులను ఎంచుకుంటూ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి అభిరుచితో సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు హీరో విశ్వక్ సేన్. ఇక లేటెస్ట్ గా విశ్వక్ సేన్ చేస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, సరికొత్త కథాంశాన్ని అల్లుకుని తెరకెక్కిస్తున్న సినిమాగా ప్రేక్షకులలో బాగా అంచనాలను అందుకుంది. అందుకే ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర బృందం రిలీజ్ డేట్ ను ప్రకటించి శుభవార్తను అందచేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వచ్చే ఏడాది మార్చి 8 న విడుదల కానుంది. ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తుండగా, అభిరుచు గల నిర్మాతగా నాగవంశీ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , మరో నాయకి అఞ్జలి కీలక పాత్రలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version