ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపి, బీజేపీ నేత వివేక్ సంచలన వాఖ్యలను చేశారు. సిసోడియా తరహాలోనే కవితా కూడా త్వరలోనే అరెస్ట్ అవుతుందని బాంబ్ పేల్చారు వివేక్. పంజాబ్, గుజరాత్ ఎన్నికల సమయంలో ఆప్ పార్టికి కవిత రూ.150 కోట్లు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో వ్యతిరేకతను ప్రక్కదారి పట్టించేందుకు బిఆర్ఎస్ పార్టిగా మారారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బులను దేశవ్యాప్తంగా కేసిఆర్ ఖర్చు చేస్తూన్నాడని ఆగ్రహించారు. మహరాష్ర్టలో, ఆంధ్రాలో అవుట్ డేటడ్ నాయకులే బిఆర్ఎస్ లో చేరుతున్నారని చురకలు అంటించారు మాజీ ఎంపి, బీజేపీ నేత వివేక్.