వివేకా మర్డర్ కేసు: అవినాష్ రెడ్డి బెయిల్ పై మధ్యాహ్నం విచారణ … !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి సొంత ఇంట్లోనే హత్యకు గురికావడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. ఇందులో ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా ప్రమేయం ఉన్న అందరినీ సిబిఐ విచారిస్తూ అనుమానం బలపడిన వారిని అరెస్ట్ చేస్తోంది. ఈ దశలోనే లేటెస్ట్ గా వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారం సాగిస్తోంది, కాగా నెక్స్ట్ లిస్ట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. కానీ ఈయన అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా ముందస్తు బెయిలుకు పిటిషన్ పెట్టుకున్న కారణంగా ఇంకా సిబిఐ ఇతన్ని అదుపులోకి తీసుకోవడం వీలుకాలేదు. కాగా ఇవాళ మధ్యాహ్నం ఈ బెయిల్ పిటీషన్ పైన విచారణ చేయనున్నారు.

అయితే తెలంగాణ హై కోర్ట్ తెలిపిన సమాచారం ప్రకారం సుప్రీమ్ వెబ్ సైట్ లో ఇంకా ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి తరపు లాయర్ కూడా చూశారు. కాగా ఈ ఆర్డర్ కాపీ వెబ్ సైట్ లో కనిపించిన తర్వాతనే తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version