జగన్ పై వివేకా భార్య ఆరోపణలు..!

-

సీఎం జగన్ మీద వైయస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ సంచలన ఆరోపణలు చేశారు తన భర్తని చంపిన హంతకులని జగన్ కాపాడుతున్నారని అనుమానాలు బలంగా ఉన్నాయని అన్నారు వివేకా మర్డర్ గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్ ఆయన భార్య భారతికి తెలుసు అని అనుమానం ఉందని అన్నారు. హత్య జరిగే ఐదేళ్లైనా హంతకులకి శిక్ష పడకపోవడం పై సౌభాగ్యమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా చనిపోయాడని తెలియగానే మేమందరం హైదరాబాద్ నుండి వచ్చామని జగన్ మాత్రం సాయంత్రం వరకు పులివెందులు ఎందుకు రాలేదు అని అడిగారు. ఈ ప్రవర్తన అనుమానానికి కారణమని అన్నారు వివేకా హత్య కేసులో కారకులను తేల్చాలని సునీత పట్టు పడడంతో ఆమెపై భర్తపై హత్య నేరం నెట్టాలని ప్రయత్నించారని అన్నారు జగన్ సీఎం కావాలని వివేకా కలలు కన్నారని కానీ ఇలాంటి పాలన కోసం కాదని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version