ఏప్రిల్ 1 నుండి పెరగనున్న మందులు ధరలు..!

-

పెరుగుతున్న ద్రవయోల్బలనం నేపథ్యంలో ప్రజలకు ఇంకో షాక్ తగలబోతోంది. ఏప్రిల్ ఒకటి నుండి నిత్యవసర మందుల ధరలు పెరగబోతున్నాయి పెయిన్ కిల్లర్స్ నుండి యాంటీ బయోటిక్స్ వరకు అన్నీ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ద్రవయోల్బలనం తో ఇబ్బంది పడుతుంటే ఇక మీదట సామాన్యుల జేబులు మీద మరింత భారం పెరగబోతుంది. అవసరమైన ఔషధాలు గురించి మాట్లాడుతూ ఇందులో నొప్పి నివారణ మందులు యాంటీబయటిక్ ఎనిమిది వందలకు పైగా గుండెకి సంబంధించిన మందులు కూడా ఉన్నాయి.

ఈ మందుల ధరలు ఏప్రిల్ ఒకటి నుండి పెరగబోతున్నాయి. వార్షిక టోకు ధరల సూచి లో మార్పుకి అనుగుణంగా ఔషధమందుల ధరలని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మందుల ధరలు పెంచాలని ఫార్మా పరిశ్రమ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది టోకు ధరల సూచికలో వార్షిక మార్పు కి అనుగుణంగా 0.0055 శాతం పెరుగుదలకు అనుమతించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version