5జి ఫోన్‌ను విడుద‌ల చేసిన వివో.. ఫీచ‌ర్లు అదుర్స్‌..

-

మొబైల్స్ త‌యారీదారు వివో కొత్త‌గా వి20ప్రొ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వివో వి సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్స‌ల్ మోనో సెన్సార్‌ ను అమ‌ర్చారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది. స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 విడుద‌ల‌య్యాక అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా దీనికి 33 వాట్ల ఫ్లాష్ చార్జ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది.

వివో వి20 ప్రొ స్పెసిఫికేష‌న్స్‌…

* 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 44, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వి20 ప్రొ స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ జాజ్‌, స‌న్‌సెట్ మెలొడీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.29,990 ఉండ‌గా, అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల‌తో ఈ ఫోన్‌పై రూ.2వేల వ‌ర‌కు ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని 12 నెల‌ల వ‌ర‌కు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version